Home » Vote
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు.
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి.. వాళ్లను బానిసలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఓటరు పోలింగ్ కేంద్రానికి ఓటరు వచ్చిన సమయంలో అధికారులు పేరు, ధృవపత్రం పరిశీలిస్తారు. అయినప్పటికి కొన్నిసార్లు దొంగ ఓట్లు నమోదవుతాయి. ఓటర్ల కోసం ఎన్నికల ప్రవర్తన చట్టం-1961లో సెక్షన్ 49(పి)లో పేర్కొంది. ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఆ సెక్షన్ ఉపయోగంగా ఉంటుంది.
తొలిసారి వృద్ధులు ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ఎన్నికల సంఘం తొలిసారి రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. దీంతో ఆదివారం హిందూపురంలో 71 మంది వృద్ధులు ఓటుహక్కు వినియగించుకు న్నారు. పురంలో 73 మంది ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోగా 71 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటువేసేందుకు గ్రామ సచివాలయ పరిధిలోని అధికారులు ఓటరుస్లిప్పులు పంపిణీచేశారు. రొద్దం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం పంపిణీ చేశారు. రొద్దం మండల వ్యాప్తంగా 48 పోలింగ్ బూతలుండగా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేసేందుకు అనువుగా ఈసీ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలకం. దీంతో ప్రతి ఓటు అభ్యర్థికి అవసరం కావడంతో ఏ ఒక్క ఓటరును వదులుకోకుండా వారిపై అభ్యర్థులు గురిపెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుంటే రాజకీయ నేతలతో పాటు జనాల్లో ఉత్కంఠ పెరిగింది. అందుకే వలస ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తు న్నారు.
విద్యావంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరం ఉండటం దేశానికి.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. ప్రజాసామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటర్ చైతన్యం అవసరమన్నారు. ఓటర్లను చైతన్యపరిచి వారు బూత్‌ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకనేలా చూడాల్సిన ఎన్నికల కమిషన్ ఆ దిశగా తగినంత కృషి చేయడం లేదన్నారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు దూరంగా ఉంచాలని అధికార పార్టీ ప్రయత్నించింది. దరఖాస్తుల మొదలు ఓటింగ్ వరకూ గందరగోళం కనిపిస్తోంది. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించి.. ఫారం-12 స్వీకరణలో సమస్యలను కొంతవరకూ సరిదిద్దారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 23,532 మంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేశారు. వీరందరికీ శుక్రవారం నుంచి ఈ నెల 6వతేదీ ...