• Home » Vote

Vote

Elections 2024: ఓటరు స్లిప్పు లేదా.. ఈ సేవలు మీకోసమే..

Elections 2024: ఓటరు స్లిప్పు లేదా.. ఈ సేవలు మీకోసమే..

దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పేరు మీద ఎన్నికల సంఘం ఓటరు స్లిప్ ముద్రిస్తుంది. పోలింగ్ సమయానికి ఓ వారం రోజుల ముందే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో)లద్వారా ఓటర్లు స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఈ ఓటరు స్లిప్ ఉండటం ద్వారా ఓటరు ఏ బూత్‌లో ఓటు వేయాలో.. ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా ఉంటుంది. దీంతో పోలింగ్ స్పీడ్‌గా జరుగుతుంది.

Elections 2024: పోలింగ్ ఏజెంట్‌కు ఉండే హక్కులు ఏంటో తెలుసా..

Elections 2024: పోలింగ్ ఏజెంట్‌కు ఉండే హక్కులు ఏంటో తెలుసా..

ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది పోలింగ్. ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే ప్రజలను పాలించే పాలకులు అవుతారు. ఈ పోలింగ్ రోజున ఎక్కువుగా వినిపించే పదం పోలింగ్ ఏజెంట్.. సాధారణంగా ఎన్నికల సిబ్బంది ఉంటారు. అదే సమయంలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఈ ఇద్దరికీ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరు ఎన్నికల సంఘం తరపున వారికి కేటాయించిన విధులు నిర్వర్తిస్తారు.

Loksabha Polls: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త

Loksabha Polls: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త

Telangana: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా.. 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

AP Elections: విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఫైర్

AP Elections: విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఫైర్

Andhrapradesh: ఓటు వేసేందుకు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో నిరీక్షిస్తున్నారు. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయని పరిస్థితి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది.

Voting Process: ఓటు ఇలా వేయండి.. బీప్ సౌండ్ రాకుంటే ఏం చేయాలంటే..?

Voting Process: ఓటు ఇలా వేయండి.. బీప్ సౌండ్ రాకుంటే ఏం చేయాలంటే..?

దేశంలో 2024 లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు(lok sabha 2024 elections) సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని 96 ఎంపీ స్థానాల కోసం పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అయితే అసలు ఓటు ఎలా వేయాలి, ఓటు వేసిన తర్వాత శబ్దం రాకపోతే(beep sound) ఏం చేయాలనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!

AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!

Andhrapradesh: ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ తీవ్రస్థాయిలో యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో డబ్బులు, నగదును రహస్యంగా పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే డబ్బుల విషయంలో పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. కొంతమందికి ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

AP Elections: ఓటు వేసే ప్రతీ ఒక్కరూ ఆలోచించేలా మహిళ నిర్ణయం.. మీరూ చూడండి!

AP Elections: ఓటు వేసే ప్రతీ ఒక్కరూ ఆలోచించేలా మహిళ నిర్ణయం.. మీరూ చూడండి!

Andhrapradesh: ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్‌ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రచారానికి తెరబడగా.. ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

AP Elections: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఈవో మీనా హెచ్చరిక

AP Elections: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఈవో మీనా హెచ్చరిక

Andhrapradesh: పోలింగ్‌లో అత్యంత ముఖ్యమైనది సిరా గుర్తు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసిన అనంతరం పోలింగ్ సిబ్బంది సిరా గుర్తు వేస్తారు. ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఈ సిరా ఎంతో ముఖ్యం. సదరు ఓటరు ఓటు వేసినట్లు తెలిసేందుకు, అలాగే ఆ ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు పోలింగ్ సిబ్బంది సిరా గుర్తును వేస్తుంటారు. అయితే చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఇటీవల ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

రూ.10 ఇస్తే వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి సదరు ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ ఇవ్వమని అడుగుతారు. అందుకోసం రూ.10 చెల్లిస్తే చాలు స్లిప్ ఇస్తారని తెలిసింది.

Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..

Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..

ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటింగ్‌ డేను నగరవాసి హాలీడేగా భావిస్తున్నాడు. పోలింగ్‌ బూత్‌ మొహమే చూడని వారి కోసం పలు సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. ట్రావెల్‌ మొదలు ఆస్పత్రుల వరకూ, హోటల్స్‌ మొదలు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల వరకూ పలు సంస్థలు ఆఫర్లు అందిస్తున్నాయి. పోలింగ్‌కు ఒక్క రోజే ఉండటంతో మరికొన్ని సంస్థలు చివరి నిమిషంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి