• Home » Vote

Vote

Pawan Kalyan: మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

గుంటూరు జిల్లా: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Loksabha Polls: పోలింగ్ బూత్ వద్ద డబ్బుల పంపిణీ

Loksabha Polls: పోలింగ్ బూత్ వద్ద డబ్బుల పంపిణీ

దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్‌లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.

Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్

Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్

Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

AP Elections 2024: కర్నూల్‌లో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..జనాల ఆగ్రహం..

AP Elections 2024: కర్నూల్‌లో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..జనాల ఆగ్రహం..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (ap elections 2024)) పోలింగ్ ఉదయం 7 నుంచే మొదలు కాగా, పలు చోట్ల ఈవీఎంలు(EVMs) మొరాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్నూలు(kurnool)లోని 78వ పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు.

AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు

AP Elections: 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

ఓటెత్తి జైకొట్టు!

ఓటెత్తి జైకొట్టు!

ఐదేళ్ల పాలన చూశారు..! అంతకు మునుపు ఐదేళ్ల పాలనా చూశారు..! అరాచకాలకు, అభివృద్ధికి తేడాలను గమనించారు. మరో ఐదేళ్ల భవితకు పునాది వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో పోటెత్తి ఓటేసి.. స్పష్టమైన సంకేతాలను పంపించారు. ఈవీఎంల మీట నొక్కేందుకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు విజేతగా నిలిచే సమయం ఆసన్నమైంది. అభ్యర్థుల భవితవ్యం అటుంచితే.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే బాధ్యత ఓటరుదే. ‘తెల్లారింది లెగండోయ్‌.. కొక్కొరోక్కో..’ అంటూ.. ఓటేసేందుకు తాము వెళ్లడంతోపాటు.. ఇరుగూ పొరుగునూ తట్టిలేపి తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రాలు కళకళలాడాలి. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. భవితను మార్చుకోవాలి. అభివృద్ధికి బాటలువేసేవారిని గురిచూసి ఎన్నుకోవాలి. ...

TDP: వసతుల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం

TDP: వసతుల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం

పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓటర్ల క్యూలైన్ల కోసం బారికేడ్ల ఏర్పాటు, నీడకోసం షామియానాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతుల కల్పనపై పర్యవేక్షించడంతో లోపాలు బయటపడ్డాయి.

ELECTIONS: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ELECTIONS: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ కేతన గార్గ్‌ తెలిపారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి అప్పగించే బాధ్యతలను రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఆధ్వర్యంలో సమర్పించారు.

AP Election 2024: మీ ఓటు ఎవరైనా వేస్తే .. ఇలా చేయండి..  ఓటింగ్‌పై వర్లరామయ్య కీలక సూచనలు

AP Election 2024: మీ ఓటు ఎవరైనా వేస్తే .. ఇలా చేయండి.. ఓటింగ్‌పై వర్లరామయ్య కీలక సూచనలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌లో మీ ఓటును మీరు కాకుండా ఇతరులు ఎవరైనా వేసినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి (Electoral Commission) ఫిర్యాదు చేయండి. మీ ఓటుపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాఈసీకి తెలియజేయాలి. రేపు జరుగుతున్న పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య కీలక సూచనలు చేశారు.

Lok Sabha Election 2024: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత

Lok Sabha Election 2024: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు (Lok Sabha Election 2024) మరికొన్ని గంటల సమయమే ఉంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ పార్టీలకు ఓట్లు మళ్లేలా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి