Home » Vote
ఈ ఎన్నికలో తన విజయం, రాష్ట్రం లో పార్టీ విజయం ఏకపక్షమని ఉమ్మడి అ భ్యర్థి గుమ్మనూరు జ యరాం అన్నారు.
ఈవీఎంలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఓటర్లను ఇబ్బంది పెట్టినట్లేనని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం పోలింగ్ సందర్భంగా మండలంలోని దర్గాహోన్నూరు, గోవిందవాడ, బండూరు, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, నేమకల్లులలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో గల అరకు, రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు వయోజనులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలని సెలబ్రిటీలు కోరారు.
Andhrapradesh: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లో ఓటర్‌పై వైసీపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపిక్ మిశ్రా స్పందించారు. ఓటర్‌పై చేయి చేసుకోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఐతా నగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఐతా నగర్‌లో ఓటరను ఎమ్మెల్యే కొట్టిన ఘటనకు చెందిన సీసీ ఫుటేజ్‌ను తెప్పించాలని దీపక్ మిశ్రా ఆదేశించారు.
బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని రామ్‌నగర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం తప్ప పోలింగ్ కూల్‌గా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రలో సతీ సమేతంగా ఓటు వేశారు.
ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పెండుగ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు భారత్‌కు ఎంతో ప్రత్యేకం. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి అయినా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వెయ్యాలి. వయో వృద్ధులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మాత్రం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేయ్యొచ్చు.
Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్‌లో బయలుదేరారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆంధ్రజ్యోతి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తుంది.