Home » Vizag News
సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు సతీమణి ఆఘ్నేశమ్మ (82) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు.
అధికారంతో పేదల భూములు కొట్టేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే జనసేన నేత మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో నరేంద్ర మోదీ(Narendra Modi) మరోసారి ప్రధాని కానున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) స్పష్టం చేశారు. ఆయన ప్రధాని ఎందుకు అవుతారో జూన్ 4న చెప్తానన్నారు. ఏపీలో మేమంటే మేము గెలుస్తామని వైసీపీ, టీడీపీలు అంటున్నాయని, విశాఖలో అయితే తానే ఎంపీగా గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాలో ఓట్ల కౌంటింగ్(Counting of votes)కు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున(Collector Mallikarjuna), విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(Visakha CP Ravi Shankar) తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం ఏడు హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక ఏడు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
భర్త తేజపై మిస్ వైజాగ్ నక్షత్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో వివరించారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచ్చానని తెలిపారు.
విశాఖ, విజయనగరం జాతీయ రహదారికి, సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం రెండు కోట్లకు పైమాటే. జగన్ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న ‘పెద్దసారు’ సొంత మనిషి ఎకరా 20 లక్షల చొప్పున కారు చౌకగా కొట్టేశారు. బినామీల పేరిట 218 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూముల మార్కెట్ ధర 436 కోట్లు ఉండగా... 43 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఇదే ధరకు మరో 160 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై (CS Jawahar Reddy) వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ ( Murthy Yadav) సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్ నోటీస్ జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) కార్యాలయం హెచ్చరించింది.
బంగాళఖాతంలో రెమాల్ తుఫాన్ దూసుకొస్తుంది. అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 6 గంటల్లో రెమాల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది.