Home » Vivek Venkataswamy
సిద్దిపేటలో అడ్వాన్స్ టెక్నాలజీతో స్కిల్ డెవలప్‌మెంట్‌ని ప్రారంభిస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కంకణం కట్టుకుందని వివేక్ వెంకటస్వామి అన్నారు.
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.
మంత్రి పదవిపై ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. పార్టీలు మారిన వారికి పదవీ ఇచ్చి తన గొంతుకోస్తే సహించేది లేదని ఓ శాసన సభ్యుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా.. మంత్రి పదవుల కోసమే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారా. అంతర్గత విబేధాలతోనే మంత్రి వర్గ విస్తరణ వాయిదాపడుతూ వస్తుందా.
రాష్ట్రంలో వర్గీకరణను అడ్డుకుంటోంది వివే క్ వెంకటస్వామితో పాటు మరికొందరు మాల నాయకులేనని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
డిసెంబరు 1న తాము నిర్వహిస్తున్న ‘మాలల సింహగర్జన’ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికులకు అండగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఉన్నారని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి ( MLA Vivek Venkata Swamy ) తెలిపారు. ఆదివారం నాడు మందమర్రి INTUC కార్యాలయంలో కార్మిక సంఘం ముఖ్య నాయకులతో గుర్తింపు సంఘం ఎన్నికలపై సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గారు,INTUC అధ్యక్షుడు జనక్ ప్రసాద్ ఉన్నారు.
ఈడీపై లీగల్‌గా ఫైట్ చేస్తానని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ( Vivek Venkataswamy ) వ్యాఖ్యానించారు.
Telangana Elections: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల నగదు బదిలీ జరిగింది. గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు బదిలీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.