Home » Visaka
operation sindoor: ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు వచ్చే వరకు భారతదేశం తన ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇకనైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం నిలిపివేయాలని, దేశ రక్షణలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుదిట్టమైన విధానం అభినందనీయమని వంగలపూడి అనిత కొనియాడారు.
జూన్ 1 నుంచి ఇండిగో సంస్థ విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీస్‌ను పునఃప్రారంభిస్తోంది. ఉదయం 7.15కి విజయవాడ నుంచి బయలుదేరి 8.25కి విశాఖ చేరుకుని, తిరిగి 8.45కి బయలుదేరి 9.50కి విజయవాడకు చేరుకుంటుంది.
సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందగా, ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షల పరిహారం ప్రకటించారు. నేషనల్ లీడర్లు, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత స్పందించారు.
టీడీపీ విశాఖ మరియు గుంటూరు నగరాల్లో మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కుప్పం, తుని, మరియు పాలకొండ మున్సిపాలిటీలలో కూడా టీడీపీ నాయకులు కీలక పదవులను గెలిచారు. టీడీపీ మరియు కూటమి అభ్యర్థులు మేయర్, చైర్పర్సన్ స్థానాలకు ఎన్నికయ్యారు.
ఆస్పత్రి ఖర్చులు తగ్గించడం ప్రజల జీవితం మెరుగుపరిచే కీలకం అని సీఎం చంద్రబాబు అన్నారు. వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విప్లవాత్మక మార్పులు అవసరమని చెప్పారు
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడ్డ విశాఖ దంపతులు రెడ్డి శశిధర్, సుమిత్రాదేవి తాము రెండున్నర గంటలపాటు పరుగులు తీశామని తెలిపారు. తమ కళ్ల ముందే స్నేహితుడు చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చేశారని వాపోయారు
తెలుగు దేశం హయంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసం జరిగిందని రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును రెండు ముక్కలుగా చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 రెండుగా విభజించారని, పోలవరం నిర్వాసితులకూ అన్యాయం జరిగిందన్నారు.
విశాఖపట్నం మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం సాధించింది. 74 మంది మద్దతుతో తీర్మానం నెగ్గినట్లు కలెక్టర్ ప్రకటించారు
గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖపట్నం జిల్లాలో 250 ఎకరాలు కేటాయించబడ్డాయి. ఈ ప్రాజెక్టు విశాఖను పెద్ద డేటా సెంటర్ కేంద్రంగా మార్చే మార్గం సుగమమైంది
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఒడిశా అధికారులు కొత్తవలస స్టేషన్‌ను రాయగడ డివిజన్లో చేర్చాలన్న ఒత్తిడితో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.