Home » Vinayaka Chaviti
పట్టణంలోని వాసవీ ఆలయంలో ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫిషనల్స్ అసోసియేషన (అవోపా) ఆధ్వర్యంలో 250 మట్టి వినాయక ప్రతిమలను గురువారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి అవోపా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి జయంతి సత్యరామ్, జిల్లా మాజీ అధ్యక్షుడు జయంతి శ్రీనివాసులు, ముఖ్య అతిథులు గా హాజరైయ్యారు.
వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశా రు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేయ నున్నారు. కరోనా తరువాత ఎక్కువ సంఖ్యలో విగ్రహాల ఏర్పాటు ఈసారి జరుగనున్నట్లు పోలీసుల వద్ద అనుమతులను బట్టి తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా మరికొన్ని ఘడియల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే చవితి వేడుకల కోసం ఊరు వాడా భారీగా పందిళ్లు ఏర్పాటు చేశారు. చిన్న పెద్దలంతా వినాయకుడిని ప్రతిష్టించి.. పూజించేందుకు సిద్దమవుతున్నారు. ఈ వేడుకలు ఘనం నిర్వహించడం కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతుంది.
బాలాపూర్ గణేశ్(Balapur Ganesh) మండపాన్ని నిర్వాహకులు ఈ సారి అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దుతున్నారు. వారం రోజుల ముందునుంచే భక్తులు బాలాపూర్‌కు వచ్చి నిర్మాణంలో ఉన్న మండపాన్ని వీక్షించి, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో మూడు రోజుల నుంచి మున్సిపల్ సిబ్బందిలో కొందరు వినాయక విగ్రహాలు విక్రయించే చోట డబ్బులు ఇవ్వాలని ఇస్తేనే విగ్రహాలు అమ్ముకోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు మున్సిపల్ కార్యాలయం సమీపాన, మార్కెట్ రోడ్డులో, రామిరెడ్డిపల్లె దారి, తేరు రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు.
సెప్టెంబర్ 7, 17వ తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం ప్రభుత్వం జారీ చేసింది. గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ పండుగలకు పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఇటీవల కాలంలో పర్వదినాలన్నీ ఒక రోజు మధ్యాహ్నం ప్రారంభమై.. మరునాడు సాయంత్రం వరకు ఉంటుంది. దీంతో ఒక రోజు మిగులు తగులు ఉంటుంది. అలాంటి వేళ.. పండగ ఏ రోజు జరుపుకోవాలంటూ భక్తుల్లో ఓ మీమాసం అయితే మొదలవుతుంది.
వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడా పందిళ్లే పందిళ్లు. చిన్నా పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా అంతా ఒక్కటై.. పందిళ్లు ఏర్పాటు దగ్గర నుంచి ప్రసాదం పంపిణి చేసే వరకు కలిసిపోయి పని చేస్తారు. ఇక విద్యార్థులు అయితే చదువులో అడ్డంకులు తొలగిపోవడానికి వినాయకుడిని పూజిస్తారు.
వినాయకచవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని ఆర్డీఓ రాణిసుస్మిత, డీఎస్పీ రవిబాబు తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఎంపీడీఓలు, సీఐలు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
దేవ దేవుళ్లు ఎంత మంది ఉన్నా.. వారిని పూజించాలంటే ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినం వినాయక చవితి. భద్రపద మాసం మంగళవారం నుంచి.. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది.