Home » Vinayaka Chavithi
శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును శ్రీశ్రీ జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీశ్రీ నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ
పిండితో చేసి ముద్దుల పిల్లవాని ప్రాణమును పోసి మురిసెను పార్వతమ్మ తండ్రిచే త్రుంచబడినట్టి తలకు బదులు దంతి శిరముంచబడెనంట ఎంత వింత తల్లిదండ్రుల ముద్దుల తనయుడతడు ప్రమధ గణముల గౌరవపాత్రుడతడు
శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో విఘ్నరాజా భవత్పాద మందార మకరంద
మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక.
(ఈ నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)
విఘ్నాలను తొలగించే మహా నాయకుడు వినాయకుడు. వినాయక చవితి నాడు గణనాథుని ప్రతిమ ప్రతి ఇంట్లో కొలువు తీరుతుంది. ఏకదంతుడి పూజను ఆధ్యాత్మిక సౌరభాలతో, ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఈ పూజలో అనేక పత్రాలను ఆయనకు సమర్పిస్తారు.
చవితి ఉత్సవాలకు పందిళ్లు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ ఉత్సవ కమిటీలు నవరాత్రుల పూజాధికాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
చవితి వేడుకలను పురస్కరిం చుకుని పార్వతి సుతుడైన వినాయకుడిని పూజించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు.
ఖైరతాబాద్‌లో సప్తముఖ మహాశక్తి రూపంలో వినాయకుడు కొలువై ఉన్నాడు. గణపతి కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలను నెలకొల్పారు. అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముడు, రాహువు, కేతువును ప్రతిష్టించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. రేపు గణేశ్ చతుర్థి పర్వదినం కావడంతో విగ్రహాల ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా నెల్లూరులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ ఆధ్వర్యంలో 10 వేల మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ జరిగింది.