Home » Village development
నంబులపూలకుంట, ఏప్రిల్ 21: మండలంలోని తాటిమానుగుంతలో గత 15రోజులనుంచి తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి నీటిని సరఫరా చేసే రక్షిత తాగునీటి బోరులో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో ట్యాంక్‌కు నీరు సరిగా సరఫరా కావడం లేదు. వచ్చిన అరకొర నీటినే కొళాయి ద్వారా పట్టుకుంటున్నామని, అయితే అవి ఎక్కడా సరిపోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
ఆ నాయకుడిది మా పక్క ఊరే. ఆయన భార్యే వైసీపీ తరపున పోటీ చేస్తోంది. పక్క ఊరే కావడంతో మా ఊరి సమస్యలు కూడా తెలిసి ఉంటాయని, పరిష్కరిస్తారని ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాం. ఏళ్లు గడిచినా మా ఊరి సమస్యలు మాత్రం తీరలేదని గోవిందురాయునిపేట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శింగనమల నుంచి రాచేపల్లికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి గోవిందురాయునిపేటకు అర కిలోమీటర్ దూరం ఉంది.
తెలంగాణలో సర్పంచ్‌ల (TS Sarpanch) గోడు వినే నాథుడే లేడా..? ప్రజల కోసం (Public) తమవంతుగా సేవచేయడానికి వచ్చిన..