Home » Vikarabad
విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల మీద జరిగిన దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది.
లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రమేయముందని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. ఘటనకు ముందు.. ఆ తర్వాత కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అభివృద్ధి చేసుకోకపోతే ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేమని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై మెున్న జరిగిన దాడిలో ఎంత మంది ఉన్నారో వారందరిపై విచారణ జరిపి కేసులు పెడతామని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డిటిసి సెంటర్‌కు తరలించారు. డిటిసి సెంటర్‌కు వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు ..
ఫార్మా కారిడార్ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.
జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మంత్రి శ్రీధర్ బాబు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఉదయం మాట్లాడితే... బీజేపీ సాయంత్రం మాట్లాడుతుందంటూ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నివేదిక అందజేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Telangana: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్‌గా పోలీసులు కనిపెట్టారు. పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా సురేష్ ఉన్నాడు.
తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయే ఇప్పుడు వికారాబాద్ రైతన్నలపై పడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌పై ఉన్న కోపాన్ని రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై చూపారని పేర్కొన్నారు.