Home » Vikarabad
ఎలాంటి అనుమతులు లేకుండా, లైఫ్ జాకెట్లు వంటి కనీస భద్రతా చర్యలు పాటించకుండా ఓ రిసార్ట్ నిర్వాహకులు చేపట్టిన బోటు షికారు రెండు ప్రాణాలను బలి తీసుకుంది.
వాడి జంక్షన్ సమీపం హల్కట్టా షరీఫ్ వద్ద జరిగే ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం జూలై 9, 11 తేదీల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి, ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణలతో సైన్స్ టీచర్‌ను విద్యాశాఖ సస్పెండ్ చేయగా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనలు రాష్ట్రంలో ఆదివారం వెలుగు చూశాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం (సిట్) నుంచి పిలుపువచ్చింది.
వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్ మండలం ఎంకతలలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ ఆయన విద్యాబోధన చేస్తున్న పాఠశాలలోనే వారి ఇద్దరు పిల్లలను చేర్పించి తోటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంజనీరింగ్ డిగ్రీలో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
వికారాబాద్ పరిగి మండలంలో పెళ్లి బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మంది మృతి, 14 మంది తీవ్ర గాయాలు పొందారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని అంగడిరైచూర్లో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు.
సంప్రదాయ చేనేత బట్టలకు ఆధునిక శైలిలో రూపొందించి మిస్ ఇండియా వంటి అంతర్జాతీయ ఈవెంట్లో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు డిజైనర్ స్వాతి.