Home » Vikarabad
వికారాబాద్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడనుకుని శవానికి అంత్యక్రియలు చేస్తుండగా.. అసలైన వ్యక్తి వచ్చి తాను బ్రతికే ఉన్నానని చెప్పాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులు షాక్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరు? అతన్నే వారు తమ కుటుంబ సభ్యునిగా ఎందుకు అనుకున్నారు? అంటే అంతా ఫోన్ తెచ్చిన చిక్కులు అని..
ఉమర్‌ఖాన్ అనే భూకబ్జాదారు తన మేన కోడలు, సోదరుడికి చెందిన భూమిని అమ్మాలని దౌర్జన్యం చేస్తున్నాడని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్‌గోముల్‌కు చెందిన నరే్‌షకుమార్ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఒక రైతు పొలం మధ్య నుంచి రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తన ఫాం హౌస్‌కు రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డును తొలగించేందుకు ప్రయత్నించిన ఆ రైతు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం మమ్మదాన్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డ్రోన్ల ద్వారా కొరియర్ డెలివరీని తొలిసారి విజయవంతంగా ప్రారంభించినట్లు బ్లూడార్ట్(Blue Dart) తెలిపింది. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. తన రవాణా వ్యవస్థలను మెరుగుపర్చుకోవడానికి డ్రోన్ సాంకేతికతనూ ఉపయోగించుకుంటున్నట్లు బ్లూడార్ట్ వెల్లడించింది.
హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో ఐదు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌ను నిలిపివేశారు. నిజానికి ఆన్‌లైన్‌లో ఈ కేంద్రాలకు సంబంధించిన స్లాట్లు ఉన్నట్లు కనిపిస్తున్నా.. బుకింగ్ జరగడం లేదు.
ఈ సమస్య కేవలం ఈ మూడు గ్రామ పంచాయతీలది మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలూ ఎదుర్కొంటున్నాయి. నాలుగు నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రెండేళ్లలో అప్పుడప్పుడు ఇచ్చినప్పటికీ.. 16 నెలలకు పైగా రావాల్సి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సకాలంలో నిధులు విడుదలైతేనే.. చిన్న పంచాయతీల నిర్వహణ భారంగా ఉంటుంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం తొలుత వాయవ్య దిశగా కదిలి ఈనెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపింది. ఇక మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వివరించింది.
రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారానికి సంబంధించి ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈనెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో 2 డిగ్రీల మేరకు పెరిగాయి.
అభం శుభం తెలియని ఓ ఐదు శిశువు వీధి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో జరిగింది.
‘‘మోదీకి 75 ఏళ్ల వయసు దాటాక ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ రిటైర్ అవుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా ఈ మేరకు స్పందించారు.