• Home » Vikarabad

Vikarabad

BRS: కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారి పట్నం  నరేందర్‌రెడ్డి

BRS: కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారి పట్నం నరేందర్‌రెడ్డి

బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డిటిసి సెంటర్‌కు తరలించారు. డిటిసి సెంటర్‌కు వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

BIG Breaking: కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

BIG Breaking: కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

దరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు ..

పంతం వద్దని సీఎంకు గతంలోనే చెప్పా

పంతం వద్దని సీఎంకు గతంలోనే చెప్పా

ఫార్మా కారిడార్‌ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.

Attack on Collector: రౌడీయిజం, గుండాయిజం చేస్తే.. తాట తీస్తాం

Attack on Collector: రౌడీయిజం, గుండాయిజం చేస్తే.. తాట తీస్తాం

జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మంత్రి శ్రీధర్ బాబు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఉదయం మాట్లాడితే... బీజేపీ సాయంత్రం మాట్లాడుతుందంటూ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Attack on Collector: వికారాబాద్ ఘటనపై ఏడీజీ కీలక నివేదిక

Attack on Collector: వికారాబాద్ ఘటనపై ఏడీజీ కీలక నివేదిక

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నివేదిక అందజేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Attack on Collector:  వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు

Attack on Collector: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు

Telangana: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్‌గా పోలీసులు కనిపెట్టారు. పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా సురేష్ ఉన్నాడు.

Harish Rao: పిచ్చోడి చేతిలో రాయి.. వికారాబాద్‌ రైతులపై పడింది

Harish Rao: పిచ్చోడి చేతిలో రాయి.. వికారాబాద్‌ రైతులపై పడింది

తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయే ఇప్పుడు వికారాబాద్‌ రైతన్నలపై పడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌పై ఉన్న కోపాన్ని రైతులు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై చూపారని పేర్కొన్నారు.

Vikarabad: ఉద్యోగులపై దాడి.. హేయమైన చర్య

Vikarabad: ఉద్యోగులపై దాడి.. హేయమైన చర్య

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో పాటు రెవెన్యూ అధికారులపై దాడిని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు.

Vikarabad: లగచర్ల రణరంగం

Vikarabad: లగచర్ల రణరంగం

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది.

ఏకంగా కలెక్టర్‌పైనే చేయి చేసుకున్న మహిళా రైతు.. ఎక్కడంటే

ఏకంగా కలెక్టర్‌పైనే చేయి చేసుకున్న మహిళా రైతు.. ఎక్కడంటే

Telangana: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకణ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి