Home » Vijayawada Durga Temple
ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు హైదరాబాద్‌లోని భాగ్యనగర్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయ కమిటీ కాసేపట్లో బంగారు బోనం సమర్పించనుంది. మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది అమ్మవారికి బంగారు బోనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నట్లు జోగిని విశాక్రాంతి చెప్పారు.