Home » Vijayawada Durga Temple
గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ అధికారులు కొత్త నిబంధనలు జారీ చేశారు. ఆలయ పవిత్రతను కాపాడే లక్ష్యంతో డ్రెస్ కోడ్ అమలు చేశారు.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసం పూర్తయ్యేవరకూ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు.
ఏపీలోని వియజవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు.
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారిని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ శృంగేరి పీఠాధిపతికి దుర్గ గుడి ఈవో రామారావుతోపాటు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో దీక్షల విరమణ కోసం భక్తులు శని, ఆదివారాల్లో ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దీంతో దుర్గగుడి పరిసరాలు కిటకిటలాడాయి.
దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. దసరా తొలిరోజు నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే
శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ క్రమంలో ఎనిమిదవ రోజు.. అంటే దుర్గాష్టమి. దీంతో అమ్మవారు శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారు దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహారించారు. ఈ నేపథ్యంలో దుర్గాష్టమని భక్తులు జరుపుకుంటారు. ఈ దుర్గాష్టమి రోజు ఆయుధపూజ చేస్తారు.