Home » Vemulawada
రాజన్న ఆలయంలో కోడెల మృతిపై సమీక్ష చేశామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం వ్యాధుల వల్ల కోడెలు చనిపోవడం బాధాకరమని తెలిపారు. కొందరు భక్తులు పాలు కూడా మరువని కోడెలను తీసుకొస్తున్నారని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. ఆదివారం తిప్పాపూర్ గోశాలలో మరో నాలుగు కోడెలు అనారోగ్యంతో చనిపోయాయి.
కోడె కడితే కోటి వరాలనిచ్చే దేవుడిగా వెలుగొందు తున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి ఎంతో విశ్వాసంతో భక్తులు అందజేస్తున్న నిజకోడెల పరి స్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గోశాలపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ, అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది.
Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన వేములవాడ పట్టణ బంద్ విజయవంతమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఎండల తీవ్రతను తట్టుకోలేక గోవులు అస్వస్థతకు గురై మృత్యువాత పడుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. ఆ పనులను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం శివనామస్మరణతో మారుమోగనుంది. మంగళవారం 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దక్షిణకాశీగా... హరిహర క్షేత్రంగా... కోడెకడితే కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్నగా... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయం ప్రసిద్ధి. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ప్రసిద్ధ శైవక్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబవుతున్న సందర్భంగా ఆలయ విశేషాలివి...