Home » VANGALAPUDI ANITHA
విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు.
ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన "హ్యాండ్లూమ్ శారీ వాక్"ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో వెయ్యి మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చీరకట్టులో మహిళలు చేసిన వాక్ పలువురిని ఆకర్షించింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) చెప్పారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన హత్యాచారం, అత్యాచార ఘటనలు అత్యంత హేయమని హోంమంత్రి అన్నారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలికను హత్యచేసిన నిందితుడ్ని వదిలిపెట్టేది లేదని హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను శనివారం దారుణంగా హత్య చేసిన నిందితుడు బోడా బత్తుల సురేశ్ (26) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
‘గంజాయి ఆచూకీ చెప్పి పట్టించిన వారికి ప్రభుత్వం తరఫున రివార్డ్ అందిస్తాం. అందుకు అవసరమైన టోల్ ఫ్రీ నంబరును 10 రోజుల్లో ఏర్పాటు చేసి ప్రకటిస్తాం’ అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
చీరాల మండలం ఈపూరుపాలెం (Epurupalem)లో యువతిపై హత్యాచారం జరిగిన 48గంటల్లోనే బాపట్ల పోలీసులు(Bapatla police) కేసును చేధించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితులను అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్ కారంకి మహేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.
అంగళ్లతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టిన తప్పుడు కేసులపై పునర్ విచారణ చేయిస్తామని.. దోషులను వదిలి పెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వార్నింగ్ ఇచ్చారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి హోం మంత్రి అనిత ఈరోజు( శనివారం) వచ్చారు.
చీరాల మండలం ఈపురుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతి దారుణ హత్యకు గురైందని హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.