Home » Vande Bharat Trains
ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించిన అటల్ వంతెనకు పగుళ్లు రావడం, ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టర్మినల్ 1 విరిగిపడటం, అయోధ్యలో నీరు లీక్ కావడం, బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కుప్పకూలడం.. ఇలా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.
వందేభారత్ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్‌సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.
ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.
రైల్వే రంగంలో పెను మార్పులే ధ్యేయంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains) గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకి వచ్చింది. ఈ రైళ్ల గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం(RTI)ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు.
వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్ మెట్రోను పరీక్షించనున్నారు.
సికింద్రాబాద్(Secunderabad) - తిరుపతి(Tirupati) మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) ప్రారంభమై నేటికి ఏడాదైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమలకు(Tirumala) వెళ్లే భక్తుల పాలిట ఇదొక వరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రారంభ రైలుకు గతేడాది ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) జెండా ఊపగా, ఏప్రిల్ 10నుంచి పూర్తిస్థాయిలో ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు..
హోలీ పండుగకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడో వందే భారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు ఇకపై 500 మి.లీ వాటర్ బాటిళ్లు అందించనున్నట్టు రైల్వే బోర్డు(Railway Board) అధికారులు తెలిపారు.