Home » Vallabhaneni Vamsi Mohan
AP High Court: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వంశీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని హైకోర్టు పేర్కొంటూ జూన్ 6వ తేదీ వరకు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది.
ఉమ్మడి కృష్ణా జిల్లా అక్రమ మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణ వాయిదా పడగా, ఆయుష్ ఆస్పత్రిలో వైద్యానికి అనుమతి ఇచ్చారు.
Vamsi Relief: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది నూజివీడు కోర్టు. వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో రెండో సారి పిటిషన్ దాఖలు చేశారు.
Vamsi Custody Case: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు రెండో సారి పిటిషన్ వేశారు. రెండు రోజులు వంశీ అస్వస్థతకు గురవడంతో సరిగా విచారణ జరగలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగా ఉందని గుంటూరు జీజీహెచ్ వైద్యులు తెలిపారు. కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జైలుకు తరలించారు.
Vamsi Health Update: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు. శ్వాస సంబంధిత సమస్య తీవ్రం కావడంతో వెంటనే వంశీని పోలీసులు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు.
టీడీపీ బుద్దా వెంకన్న, పేర్ని నాని పై కఠిన విమర్శలు చేశారు. వంశీని స్వాతంత్య్ర సమరయోధుడిగా పోల్చినందుకు పేరు నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
YSRCP Leaders: కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఐ భాస్కర్‌రావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ని వదిలిపెట్టమని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.
కృష్ణా జిల్లాలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. వంశీ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో విచారణ కొనసాగుతోంది.
అక్రమ మైనింగ్ కేసులో వంశీ వల్లభనేని దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు.