Home » Uttam Kumar Reddy Nalamada
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ-3లో కెనాల్ సవరణ అంచనాలను ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో తనది క్రియాశీలక పాత్ర అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.
‘వన్ మ్యాన్ షో.. వన్ ఫ్యామిలీ రూల్‌కు కాలం చెల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 11 మంది మంత్రులు పవర్ ఫుల్. 24/7 పనిచేస్తున్నాం.
తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే (ప్రస్తుత టర్మ్‌లోనే) శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
పది నెలల వ్యవధిలో 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రుణమాఫీలో తెలంగాణ రికార్డ్ సాధించిందని అన్నారు. 11 నెలల పాలనలో రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు.
బీఆర్‌ఎస్ నాయకులు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెబుతారని.. ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చుక్క నీరు లేకున్నా రాష్ట్రంలో 66.5 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
‘ఒక్క ఏడాదిలో రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చాం. ఇది నంబర్ మాత్రమే కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి సింగూరు రిజర్వాయర్‌కు 20 టీఎంసీలు నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్యాకేజీ-19ఏ పనులను పునఃప్రారంభించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.