Home » Uttam Kumar Reddy Nalamada
ఎట్టకేలకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవన్నపేటలో దేవాదుల మూడోదశ పంప్‌హౌజ్ వద్ద ఒక మోటార్ రన్ ప్రారంభమైంది.
గత పాలకులు ఉప ఎన్నికలు వచ్చినప్పుడే తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ తన పదేళ్ల పాలనలో పేదలకు అన్యాయం చేసిందన్నారు.
సీడబ్ల్యూసీ అలా చెప్పలేదన్న ఉత్తమ్ మాటలు నిజమైతే తానే క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా సభలో, ఆ తర్వాత ఆయా అంశాలపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు.
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది రోజున, మార్చి 30న, సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్నారని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రామస్వామి గట్టు వద్ద మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఎల్‌ఎ్‌సబీసీ దుర్ఘటనతో పనులు నిలిచాయని, త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని చెప్పారు.
అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్ నాయకులు ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవన్నపేటలో కట్టిన పంప్‌హౌ్‌సలో ఒక మోటార్‌ను ఈ నెల 19వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
సాంకేతిక పరమైన అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వచ్చే వేసవిలో చేవెళ్ల ప్రాణహిత -తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.