Home » Ukraine
ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
భారతదేశ ఆకాంక్షలు నిజమయ్యేదాకా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూనే ఉంటుందని, విశ్రాంతికి అవకాశమే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై దాదాపు 30 నెలలు గడుస్తోంది! భౌగోళికంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం (1,71,25,191 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 16 దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది).. 11.5 లక్షల సైనిక బలం, అణ్వాయుధాలు ఉన్న దేశం..
ఉక్రెయిన్, రష్యా మధ్య రెండున్నరేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోరారు. మోదీ-బైడెన్ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.
ఆయుధాగారాలే లక్ష్యంగా రష్యాపై విరుచుకుపడుతోంది ఉక్రెయిన్..! గత బుధవారం ట్వెర్ ప్రావిన్స్ తుర్పెట్ గ్రామంలో ఉన్న భారీ డిపోను ధ్వంసం చేసి కలకలం రేపింది..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తాజాగా దాడికి యత్నించిన వ్యక్తిని 58 ఏళ్ల వయసున్న ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరించబోతోందా? ఈ మేరకు త్వరలోనే తనవంతు ప్రయత్నం మొదలుపెట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు చేపట్టేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ ధోవల్ ఈ వారంలోనే రష్యా వెళ్లనున్నారని కేంద్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్‌పై రెండున్నరేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా.. శాంతి చర్చల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించగలదని అభిప్రాయపడింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం విరమించుకునే విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించగలవని ఆయన అన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.