Home » Ukraine
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల అనంతరం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖనిజాల ఒప్పందంలో గత వారం ఏకాభిప్రాయం కుదరలేదని, నిర్మాణాత్మక చర్చ కోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని, అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనని ఆయన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీసులో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వివాదంపై ప్రపంచ దేశాలు భిన్నస్వరం వినిపిస్తూనే ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం రసాభాసగా మారిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భారీ ఊరట దక్కింది. ఉక్రెయిన్ మిలిటరీ సామర్థ్యాల పెంపు కోసం 2.26 బిలియన్ పౌండ్ల రుణం ఇచ్చేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది.
అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. తాజాగా, వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా స్పందించింది..
శ్వేతసౌధంలో పబ్లిక్‌గా డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాదులాడుకోవడం చూసి తట్టుకోలేకపోయిన ఉక్రెయిన్ దౌత్యవేత్త వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను శ్వేతసౌధం డిప్యుటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్వయంగా షేర్ చేశారు.
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం తాను తన పదవి వదులుకునేందుకు కూడా సిద్ధమేనని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి రేపటితో (ఫిబ్రవరి 24) మూడేళ్లు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ భారీగా డ్రోన్లతో దాడులు చేసింది. దీనిపై ఉక్రెయిన్ కూడా స్పందించింది.
శాంతి చర్చలు మొదలు కానున్న వేళ ఉక్రెయిన్ రష్యాకు భారీ షాకిచ్చింది. రష్యాకు అత్యాధునిక ఎస్-350 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను తాము ధ్వంసం చేసినట్టు తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.
ఐరోపా దేశాల రక్షణ కోసం ఉమ్మడిగా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఐరోపాకు అమెరికా అండగా నిలిచే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. ఐరోపా భవితవ్యం ఐరోపా వాసుల చేతుల్లోనే ఉందని అన్నారు.
ఏ దేశానికి వెళ్ళినా, ఆ దేశ ప్రజలు-భారతీయుల మధ్య సత్సంబంధాలను పటిష్ట పరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య నీతి సాగుతోంది. బహుళ ధ్రువ ప్రపంచంలో ఎటువైపూ వాలిపోకుండా, సమాన దూరం పాటిస్తూ, సమతుల్యతతో అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.