• Home » UCC

UCC

Azad on UCC: యూసీసీ అంటే 370 అధికరణను రద్దు చేసినట్టు కాదు..!

Azad on UCC: యూసీసీ అంటే 370 అధికరణను రద్దు చేసినట్టు కాదు..!

ఉమ్మడి పౌర స్మృతి అమలు విషయంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం జాగరూకతతో ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రాటిక్ ప్రొగ్రసిస్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ అజాద్ అన్నారు. యూసీసీని అమలు చేయడమంటే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికారణను రద్దు చేసినంత సులువు కాదన్నారు.

Parliament : ఈ నెల 19న కేంద్రం అఖిల పక్ష సమావేశం.. ఆ కీలక బిల్లుపై చర్చ కోసమేనా..?

Parliament : ఈ నెల 19న కేంద్రం అఖిల పక్ష సమావేశం.. ఆ కీలక బిల్లుపై చర్చ కోసమేనా..?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code - UCC) బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

Jagdeep Dhankar: యూసీసీ అమలుకు సమయం వచ్చేసింది... ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

Jagdeep Dhankar: యూసీసీ అమలుకు సమయం వచ్చేసింది... ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి పౌర స్మృతిపై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీని తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని, ఇంకెంతమాత్రం ఆలస్యం తదగని అన్నారు. ఐఐటీ గౌహతిలో మంగళవారంనాడు జరిగిన 25వ స్నాతకోత్సవంలో ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Mayawati on UCC: యూసీసీకి వ్యతిరేకం కాదు..కానీ..!

Mayawati on UCC: యూసీసీకి వ్యతిరేకం కాదు..కానీ..!

ఉమ్మడి పౌర స్మృతికి బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీం మాయావతి మద్దతు తెలిపారు. భారతీయులందరినీ యూసీసీ కలిపి ఉంచుతుందని అన్నారు. అయితే బీజేపీ బలవంతంగా ఈ సంస్కరణను చేపట్టేందుకు జరుపుతున్న ప్రయత్నాన్ని ఆమె తప్పుపట్టారు.

Uniform Civil Code : అఖిలేశ్ యాదవ్‌కు షాక్.. యూసీసీకి మద్దతిచ్చిన ఆయన మిత్ర పక్షం..

Uniform Civil Code : అఖిలేశ్ యాదవ్‌కు షాక్.. యూసీసీకి మద్దతిచ్చిన ఆయన మిత్ర పక్షం..

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)కు గట్టి షాక్ తగిలింది. ఆయన మిత్ర పక్షం సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)కు మద్దతు ప్రకటించింది. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని స్పష్టం చేసింది.

UCC In india: సమానత్వం, సమన్యాయం యూసీసీతోనే సాధ్యం...

UCC In india: సమానత్వం, సమన్యాయం యూసీసీతోనే సాధ్యం...

ఉమ్మడి పౌర స్మృతి అమలు కోసం కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాద్ నఖ్వి కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీకి సూత్రప్రాయంగా ఆయన మద్దతు ప్రకటించారు. చట్టం చేయడానికి ఇదే తగిన సమయమని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పెడూ యూసీసీపై చట్టం తేలేమని అన్నారు.

NPP on UCC: యూసీసీకి ఎన్డీయే భాగస్వామి ఝలక్

NPP on UCC: యూసీసీకి ఎన్డీయే భాగస్వామి ఝలక్

ఉమ్మడి పౌర స్మృతి ఆలోచనతో మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె.సంగ్మా విభేదించారు. భారతదేశ వాస్తవ ఆలోచనకు యూసీసీ విరుద్ధమని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ ఆలోచనా విధానానికి ఉమ్మడి పౌర స్మృతి ఎంతమాత్రం తగదని అన్నారు.

Congress meet on UCC: సోనియాగాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం

Congress meet on UCC: సోనియాగాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం

కేంద్ర పౌర స్మృతిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం జూలై 3న సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ నివారం సమావేశమవుతోంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసమైన 10 జనపథ్‌లో సమావేశం కానున్నారు. యూసీసీపై చర్చలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

Uttarakhand UCC: ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలుకు డ్రాఫ్ట్ కాపీ రెడీ.. ముసాయిదాలోని అంశాలు ఏమిటంటే..?

Uttarakhand UCC: ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలుకు డ్రాఫ్ట్ కాపీ రెడీ.. ముసాయిదాలోని అంశాలు ఏమిటంటే..?

ఉమ్మడి పౌర స్మృతిపై ఓ వైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, మరోవైపు త్వరలోనే ఉత్తరాఖండ్‌లో యూసీసీని అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి శుక్రవారం ప్రకటించారు. యూసీసీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన పనిని ఈరోజుతో పూర్తి చేసిందని, డ్రాఫ్ట్ కాపీ సిద్ధం చేసిందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి