• Home » Twitter

Twitter

KTR: 499మందిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు: ఎమ్మెల్యే కేటీఆర్..

KTR: 499మందిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు: ఎమ్మెల్యే కేటీఆర్..

స్వాతంత్ర్య భారతదేశంలోనే రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్(Congress) అతి పెద్ద మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రైతులను నిండా ముంచారని కేటీఆర్ మండిపడ్డారు.

Speaker Prasad Kumar: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎక్స్ అకౌంట్ హ్యాక్..

Speaker Prasad Kumar: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎక్స్ అకౌంట్ హ్యాక్..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)కు భారీ షాక్ తగిలింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయన ఎక్స్(X) ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని అసభ్యకర వీడియోలను పోస్టు చేశారు.

KTR: తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం.. ఎందుకంటే?

KTR: తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం.. ఎందుకంటే?

తెలంగాణలో డెంగ్యూ(Dengue) మరణాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు డెంగ్యూ మరణాలే లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.

KTR: వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్..

KTR: వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) దుష్ట పాలన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా మండిపడ్డారు.

Elon Musk: ఎక్స్ యాప్ నుంచి త్వరలో క్రేజీ ఫీచర్.. వాట్సాప్‌కు పోటీగా..

Elon Musk: ఎక్స్ యాప్ నుంచి త్వరలో క్రేజీ ఫీచర్.. వాట్సాప్‌కు పోటీగా..

బిలయనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం X (ట్విట్టర్) యాప్‌ని వేరే స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యాప్‌ను పూర్తిగా మార్చేశారు. అనేక ఫీచర్లలో మార్పులు చేశారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటికీ ఉపశమనం పొందలేదు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ X యాప్ నుంచి మరో ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది.

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..

Nara Lokesh: ఐఐటీ విద్యార్థికి అండగా మంత్రి నారా లోకేశ్..

Nara Lokesh: ఐఐటీ విద్యార్థికి అండగా మంత్రి నారా లోకేశ్..

లక్నో ఐఐటీ(IIT Lucknow)లో చదవాలన్న ఓ పేద విద్యార్థి కలను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) నెరవేర్చారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు రూ.4లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరని ఎక్స్(ట్విటర్) వేదికగా లోకేశ్‌కు విద్యార్థి విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి ఫీజు విషయం తాను చూసుకుంటానని చదువుపై దృష్టి పెట్టాలంటూ రీట్వీ్ట్ చేశారు.

JC: విజయలక్ష్మిను జేసీ కలిసిన కారణమిదే...!

JC: విజయలక్ష్మిను జేసీ కలిసిన కారణమిదే...!

Andhrapradesh: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి కలిసినట్టుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. విజయమ్మను జేసీ కలవడానికి కారణమేంటి?.. రాజకీయన పరమైన అంశాలు ఏమన్నాయ ఉన్నాయా? వీరి కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుందా?.. అంటూ అనే ప్రశ్నలు కూడా జోరుగా వినిపించాయి. అయితే ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీయడంతో జేసీ ముందుకు వచ్చారు.

Minister Ravi Kumar: లైన్‌మెన్ రామయ్య సాహనం ప్రశంసనీయం: మంత్రి గొట్టిపాటి

Minister Ravi Kumar: లైన్‌మెన్ రామయ్య సాహనం ప్రశంసనీయం: మంత్రి గొట్టిపాటి

లైన్‌మెన్ కూర రామయ్య(Lineman Kura Ramaiah) చేసిన సాహనం ఏపీ విద్యుత్ ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi Kumar) అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ తీగలపై నడిచివెళ్లి కరెంట్ పునరుద్ధరించడాన్ని మంత్రి కొనియాడారు.

YS Jagan: వైఎస్ జగన్‌ను నెటిజన్లు గట్టిగానే ఆడుకుంటున్నారే..!

YS Jagan: వైఎస్ జగన్‌ను నెటిజన్లు గట్టిగానే ఆడుకుంటున్నారే..!

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌కు ట్రోలింగ్ దెబ్బ గట్టిగానే పడుతోంది. మాజీ సీఎం సోషల్ మీడియా పోస్టులను నెటిజన్లు వెంటాడుతున్నపరిస్థితి. ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ పెడుతున్న పోస్టులపై ట్విట్టర్‌లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చివరకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిపై జగన్ చేసిన ట్వీట్‌పైనా తూర్పారపడుతూ ప్రశ్నలతో ట్వీట్లు హోరెత్తిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి