Home » Twitter
ఒకే రోజు నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిదని.. రైతు రాజ్యం కాదిది.. రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్ళలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిదని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక మైలు రాళ్లను చేరుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ ఐదేళ్ల పాలనకు మించి అభివృద్ధి చేసి చూపించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్‌ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
ప్రశ్నించడమే నేరమా.. నిలదీయడమే పాపమా.. అని బాల్క సుమన్ అన్నారు. లగచర్ల, దిలావర్ పూర్, రైతుకు బేడీలు, విద్యార్థుల మరణాలు, గురుకుల సంక్షోభాలు.. ఇలా వీటన్నింటిపై కేటీఆర్ నిలదీస్తున్నందుకే కుట్రాలా అంటూ ఆయన ప్నశించారు.
సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్(ట్విటర్) ఖాతా డీపీ(డి్‌సప్లే పిక్చర్)ని గురువారం మార్చారు.
తెలంగాణ రైతన్నలు రుణం తీరక, కొత్త రుణాలు పుట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంత జరుగుతున్నా రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం కలగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాయలసీమలోనూ కులవ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త గురు కనకదాస అని ఏపీ సీఎం చంద్రబాబు కీర్తించారు. బీసీలను, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఏళ్ల కిందటే ఆయన చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి పై తాను గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం 'ఎక్స్'(గతంలో ట్విటర్)ను అణచివేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం కుట్ర పన్నుతోందా. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో పాలన చేతకాకే కాంగ్రెస్ పార్టీ నేతలు పనికిమాలిన మాటలు, పాగల్ పనులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.