Home » Twitter
అమెరికాలోని న్యూయార్క్ సిటీ సబ్ వేలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. పక్కన కూర్చున్న వ్యక్తి తన భుజంపై తల పెట్టి నిద్రపోయినందుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అతడిపై తీవ్రంగా దాడి చేశాడు.
భారీ వర్షాలు పడినపుడు ఉరుములు, మెరుపులు సహజం. చాలా సార్లు పిడుగులు కూడా పడుతుంటాయి. ఆయా ప్రాంతాల్లోని చెట్లు, ఎత్తైన నిర్మాణాలపై పిడుగులు పడుతుంటాయి. తాజాగా సౌదీ అరేబియాలోని ప్రసిద్ధ మక్కా క్లాక్ టవర్‌పై పడిన పిడుగు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది.
ఎన్నో వందల ఏళ్లుగా మనుషులకు కుక్కలు విశ్వాసంగా ఉంటున్నాయి. ఎప్పుడైనా కొద్దిగా ఆహారం ఇస్తే చాలు ఆ వ్యక్తిని కుక్క ఎప్పటికీ మర్చిపోదు. కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఎప్పటికప్పుడు కొత్త సమాచారం వస్తూనే ఉంది.
మీరు స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? లోన్ కావాలా? క్రెడిట్ కార్డు కావాలా? డీటీహెచ్ ఆఫర్ అంటూ మీకు రోజూ ఫోన్లు వస్తున్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పామ్ కాల్స్ ఆగడం లేదా? అవాంఛిత కాల్స్ ఆపడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతున్నట్టైతే మీరు ఒకసారి ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి. కచ్చితంగా పని చేసేలాగా ఉంది.
అవసరం అన్నింటినీ సృష్టించింది. అవసరమైన దానిని దక్కించుకునేందుకు మన బుర్ర అద్భుతంగా పని చేస్తుంది. ఫలితంగా కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయి. అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం అయిపోతుంది. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అందరికీ అదే సమస్య. అలాగని వీళ్లేమీ వింత ప్రపంచంలో ఉన్నవాళ్లేమి కాదు.
స్నేహితులతో బయటకు వెళ్లినపుడు బిల్లు ఎవరు కట్టాలనే విషయంలో చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటాయి. నేను కడతాను అంటే, నేను కడతానని స్నేహితులు కాసేపు వాదించుకుంటారు. ఆ తర్వాత ఎవరో ఒకరు బిల్లు కట్టేస్తారు. మరొకరు డబ్బులు పర్సులు పెట్టేస్తారు.
ప్రస్తుతం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ (Pre Wedding Photo Shoot) అనేది ఒక ట్రేండ్‌గా మారిపోయింది. కాబోయే వధూవరులు చిత్ర విచిత్రమైన ఫోజులతో, వింత అలంకరణతో ప్రమాదకర స్థలాలకు వెళ్లి మరి ఫొటో షూట్స్ చేస్తున్నారు. దాంతో ఒక్కొసారి ప్రాణాంతక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో, పార్లమెంట్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా?. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో గౌరవ సోనియా గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ
విశ్వనగరం చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్... బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్‌పేటలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారు.