• Home » Tungabhadra

Tungabhadra

Nimmala: తుంగభద్ర వద్ద నిపుణుల శ్రమ ఫలించింది..

Nimmala: తుంగభద్ర వద్ద నిపుణుల శ్రమ ఫలించింది..

Andhrapradesh: తుంగభద్ర డ్యామ్ దగ్గర 19వ తాత్కాలిక గేటు బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు, మూడవ ఎలిమెంట్‌లు ఇంజనీర్లు అమర్చుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ 60x4 మొదటి బిట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల శ్రమ ఫలించిందన్నారు.

TUNGABADRA DAM : సంకల్పానికి సలాం!

TUNGABADRA DAM : సంకల్పానికి సలాం!

తుంగభద్ర జలాశయం నిండుకుండగా మారి.. 105.78 టీఎంసీలు నిల్వ ఉండగా.. అనుకోని విపత్తు ఎదురైంది. క్రస్ట్‌ గేట్‌ల నుంచి నదిలోకి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో.. ఈ నెల 10వ తేదీ రాత్రి సుమారు 10.30 సమయంలో 19వ క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయింది. విషయం తెలియగానే లక్షలాది ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రైతాంగంలో ఆందోళన, నైరాశ్యం చోటు చేసుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ ...

AP News : సాహసమే!

AP News : సాహసమే!

నాడు దివి నుంచి భువికి గంగను దించేందుకు భగీరథ మహర్షి మహా ప్రయత్నమే చేశారు. నేడు... తుంగభద్రమ్మను కాపాడుకునేందుకు ఇంజనీర్లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.

 Nagarjuna Sagar project : అర అడుగే తక్కువ!

Nagarjuna Sagar project : అర అడుగే తక్కువ!

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 589.50 అడుగుల (310.25 టీఎంసీలు)కు చేరింది. కుడి కాల్వ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం నుంచి 29,232 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

 Tungabhadra Dam : ఒకే ఒక ఆశయం..!

Tungabhadra Dam : ఒకే ఒక ఆశయం..!

తుంగభద్ర డ్యాం నిండింది. దిగువన ఆయకట్టు సేద్యానికి సిద్ధమైంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో క్రస్ట్‌ గేట్‌ల ద్వారా నదికి వరద నీటిని వదిలారు. ఇంతలో అనుకోని విపత్తు ఎదురైంది. నీటి ఉధృతికి 19వ నంబరు క్రస్ట్‌ గేట్‌ ఐదు రోజుల క్రితం కొట్టుకుపోయింది. దీంతో డ్యాం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వృథాగా దిగువకు పరుగులు తీస్తున్న నీటిని ఆపేందుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు, నిపుణులు రంగంలోకి దిగారు. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం మరింత చొరవ చూపింది. క్రస్ట్‌ గేట్‌ స్థానంలో స్టాప్‌ లాగ్‌ ...

Jagan Effect: జగన్ తీరు.. నీటిపారుదల  ప్రాజెక్టులకు శాపం..

Jagan Effect: జగన్ తీరు.. నీటిపారుదల ప్రాజెక్టులకు శాపం..

అమరావతి: గత ఐదేళ్లలో నీటిపారుదల రంగం పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రాజెక్టులకు శాపంగా మారింది. ప్రాజెక్టులపై వైసీపీ సర్కార్ పూర్తిగా నీళ్లొదిలేసింది. తుంగభత్ర గేటు కొట్టుకుపోవడంతో జగన్ ప్రభుత్వంలోని నిర్వహణ లోపాలు బహిర్గతమవుతున్నాయి. నేడు తుంగభద్ర, అంతకుముందు అన్నమయ్య డ్యామ్, పులిచింతల, గుండ్లకమ్మ, పెద్దవాడు, మూసి ఇలా ఏ ప్రాజెక్టు చూసినా నిర్వహణ లోపం కనిపిస్తోంది.

Nagarjuna Sagar: సాగర్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా?

Nagarjuna Sagar: సాగర్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా? అని నీటిపారుదల శాఖ విశ్రాంత నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోయింది

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోయింది

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రదాయిని అయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది! శనివారం రాత్రి డ్యామ్‌ 19వ గేటును ఎత్తుతుండగా చైన్‌లింక్‌ తెగిపోవడమే ఇందుకు కారణం.

 Tungabhadra Dam : ఆశలు ఢాం!

Tungabhadra Dam : ఆశలు ఢాం!

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్‌) ప్రమాదంలో పడింది. డ్యామ్‌కి అమర్చిన 19వ క్రస్ట్‌గేట్‌ చైన లింక్‌ తెగిపోయి, శనివారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్‌లోని నీటిని నదికి వదిలేస్తున్నారు. సుమారు 65 టీఎంసీల మేర నీరు నదికి విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి తెలిపారు. డ్యామ్‌లో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త క్రస్ట్‌గేట్‌ అమర్చడానికి అవకాశం ఉంటుందని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. డ్యామ్‌కి మొత్తం ...

Tungabhadra Dam: ఊడిన తుంగభద్ర డ్యామ్ గేటు..

Tungabhadra Dam: ఊడిన తుంగభద్ర డ్యామ్ గేటు..

అధికారుల నిర్లక్ష్యంతో డ్యామ్ గేటు ఊడింది. కర్ణాటకలో హోస్పేట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు నిన్న రాత్రి (శనివారం) ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. దీంతో అధికారులు ఆందోళన చెందారు. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. గేటు తెగడంతో నీటి ప్రవావం పోటెత్తింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి