Home » Trains
సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చనే ఉద్దేశంతో ఓ వ్యక్తి రెండు వేల రూపాయలకు పైగా ఖర్చు చేసి రైల్లో ఏసీ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తీరా పడుకుందామని చూడగా అతడికి ఛేదు అనుభవం ఎదురైంది. దీంతో చివరకు రాత్రంగా జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది...
ఓ రైల్లో యువకుడు రీల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. లోపల కూర్చుని వీడియో తీసుకుని ఉండుంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. అయితే ఇతను మాత్రం.. ఎలాగైనా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు రైలుకు వేలాడుతూ రీల్ చేయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పెషావర్ రైలు హైజాక్ ఘటనలో ఇప్పటివరకు 127 మంది ప్రయాణికులను రక్షించినట్లు పాకిస్తాన్ భద్రతా దళాలు తెలిపాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వేర్పాటువాదులు రైలును హైజాక్ చేశారు. 9 బోగీలతో, 500 మందికి పైగా ప్రయాణికులతో క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రె్‌సను మంగళవారం సాయుధులైన దుండగులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
Train Journey: రైలులో చైన్ లాగితే జరిమానా విధిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ కొన్ని సమయాల్లో మాత్రం రైలులో చైన్ లాగితే.. జరిమానా విధించరు. ఎందుకో తెలుసా..? ప్రయాణికుడి భద్రతే లక్ష్యంగా రైల్వే శాఖ నిత్యం కసరత్తు చేస్తుంది. అలాంటి వేళ.. ప్రయాణికుడి కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
చెన్నై-గూడూరు, అరక్కోణం-జోలార్‌పేట, సేలం-కోయంబత్తూర్ తదితర మార్గాల్లో గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది.
హోలీ పండగ నేపథ్యంలో నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లను నడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 18న సాయంత్రం 6.10గంటలకు మాల్దా టౌన్ నుంచి ప్రత్యేక రైలు(03430) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు.
కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
ప్రతిభాషకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిదని, అదే సమయంలో ప్రతిభాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడం వారికి భారం అవుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు.
బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్(Bangalore East Railway Station)లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్‌లో స్టాపింగ్‌ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.