Home » Trains
రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నడుపుతున్న 37 ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్పుచేసినట్లు దక్షిణ రైల్వేశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుండి జూన్ 16,19,23, 26,30 తేదీల్లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరే పినాకిని ఎక్స్‌ప్రెస్ (నెం:12712) 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలు తగ్గించాలని దక్షిణ రైల్వే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశముంది. అలాగే బోగీల తగ్గింపు నిర్ణయంపై ఇప్పటికే పలు విమర్శలొస్తున్నాయి.
IRCTC's Ask Disha 2.0: ఇప్పుడు ఎవరూ రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి IRCTC పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో వాయిస్ కమాండ్ ఇస్తే చాలు.. IRCTC ఏఐ చాట్-బాట్ టిక్కెట్ బుకింగ్స్, క్యాన్సిలింగ్ సహా పలు సేవలను చిటికెలోనే పూర్తి చేసేస్తుంది.
31వతేదీ, జూన్ 2వ తేదీన చెన్నై సెంట్రల్-గూడూరు సబర్బన్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే.. 1న చెన్నై బీచ్-చెంగల్పట్టు మధ్య సబర్బన్ రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.
సింగరేణి కార్మిక ప్రాంతమైన మంచిర్యాల ప్రజలకు శుభవార్త. మంచిర్యాల రైల్వేస్టేషన్ లో ఇకనుంచి భగత్ కి కోఠి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు మంచిర్యాల స్టేషన్లో ఆగుతుంది. ఈ నెల 31వ తేది నుంచి ఈ ప్రత్యేక రైలుకు హాల్టింగ్ కల్పించారు.
జూన్ 1నుంచి జూలై 31 వరకు 44 వీక్లీ స్పెషల్ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. విశాఖపట్నం-చర్లపల్లి, తిరుపతి-విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.
ఓ వృద్దుడు రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వస్తాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
హైదరాబాద్ - కలబురిగి మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలబురిగిలో జరగనున్న ఉర్సు-ఎ- హజరత్ ఖాజా బంధన్‌వాజ్ సందర్భంగా ఈ రైళ్లను నడుపుతున్నారు.
ఓ యువకుడి డేంజరస్ స్టంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు పట్టాలపై యువకుడు చేసిన విన్యాసంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
రైలు పట్టాలపై పెద్దబండ రాళ్లను పెట్టిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. అయితే... ప్రయాణికుల రైలు కాకుండా.. గూడ్స్ రెలు ఆ మార్గంలో రావడం, అది పెద్ద శబ్దంతో రావడంతో వెంటనే గమనించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం వారు వచ్చి చూడగా పెద్ద బండరాళ్ల విషయం వెలుగులోకి వచ్చింది.