Home » TPCC
హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అలర్ట్. ఎవరైతే గురువారం (25/01/24) నాడు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రయాణం చేయాలని అనుకున్నారో, వాళ్లు తమ రూట్‌ని మార్చుకోక తప్పదు. ఎందుకంటే.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.
తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారని విమర్శించారు. చిత్త కార్తె కుక్కల్లా తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును కాంగ్రెస్ మంత్రిని చేసిందని గుర్తుచేశారు. రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ (Congress, BJP) పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)... కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన సంకేతాలు ఇచ్చారు.
త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ సీనియర్ నేత కోదండ రెడ్డి పలు సూచనలు చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు టీపీసీసీ సీనియర్ నేతలు సమావేశం కానున్నారు.
రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు కాంగ్రెస్ సిద్ధమైంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ప్రాథమిక వడపోతలో కీలకమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సోమవారం గాంధీ భవన్‌లో భేటీ కానుంది. ఈ సమావేశంలో స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్, సభ్యులు కూడా పాల్గొననున్నారు.