Home » TPCC
‘‘స్వాతంత్ర్యానంతరం దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. తనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు అప్పగించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy)కి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఇది సమాజానికి, రాజకీయ నాయకులకు మంచిది కాదని వెంటనే ఒళ్లు దగ్గర పెట్టుకొని రాజకీయం చేసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్(Gauri Satish) పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నప్పటికీ.. 10కిపైగా సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీలను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పాలనపై..
టీసీపీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులున్నా.. పార్టీని అధికారంలోకి తెచ్చారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గత కొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరంటూ సాగిన ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది.
టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ(INC) 3 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సదరు జాబితా సిద్ధమైందని శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయంలోపు పేర్లను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జంట నగరాలలోని చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ కార్మిక విభాగం కార్యదర్శి వీవీ రవీంద్రనాథ్ నాయుడు(VV Rabindranath Naidu) కోరారు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..