Home » TPCC Chief
నీళ్ళు, నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ స్లోగన్ అని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని ఆయన చెప్పారు.
రాష్ట్ర డీజీపీని కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం కలిశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... డీజీపీని కలిసి రెండు అంశాలను చర్చించామని తెలిపారు. హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్యపై డీజీపీ దృష్టికి తెచ్చామని అన్నారు.
హైదరాబాద్: దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని, సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)... కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన సంకేతాలు ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీపీసీసీ స్వీకరించనుంది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది లేకుండానే ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. బుధవారం నుంచి రేవంత్‌కు భద్రతగా గన్‌మెన్లు వెళ్లడం లేదని సమాచారం. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్‌నగర్ పోలీసుల్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతా. 100 రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తాం. అసలు మిత్తితోని చెల్లిస్తాం’’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.
24 గంటల ఉచిత విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.16,500 కోట్ల ఖర్చు చూపిస్తోంది. కానీ 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఇస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా విద్యుత్ ఇస్తున్నారు. ఆ లెక్కల రూ.8 వేల కోట్ల చిల్లర మాత్రమే విద్యుత్ కొనుగోలుకు ఖర్చవుతుంది. ప్రతి సంవత్సరం రూ.16 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చులు చూపింది. మరి దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు.
ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.