Home » TMC
బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 'RG Kar అత్యాచారం-హత్య' కేసు విషయంలో వ్యవహరించిన తీరు, పనితీరులో వైఫల్యం, గూండాయిజం, ముఖ్యంగా GenZ, GenX తరం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం కీలకమైంది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించింది.
బెంగాల్‌లో చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్‌మత్ పోల్స్ టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు టీఎంసీ ఎంపీలు గైర్హాజరవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఎంపీలంతా హాజరై కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని ఆయన కోరారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన టీఎంసీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం, ఎన్నికల సంఘం మధ్య బుధవారంనాడిక్కడ జరిగిన సమావేశం రసాభాసగా ముగిసింది. ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఇరువర్గాలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే 291 మంది అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు గట్టి పట్టున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో కోల్‌కతా నగరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. రాష్ట్ర మంత్రి శశి పంజా నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. పశ్చిమబెంగాల్‌లో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు 12 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరింది.