Home » TMC
టీఎంసీ తిరుగుబాటు ఎంపీలపై ఆ పార్టీ సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ద్వంద్వ వైఖరి కలిగిన వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. పార్టీ పట్ల అంతగా అసంతృప్తి ఉంటే వాళ్లు రాజీనామా చేయాలన్నారు.
టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు పార్లమెంటుకు పాకింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి కొనసాగింపుగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.
తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు.
పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కమార్‌హాటీ నియోజకవర్గంలోని అరియాదయా ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులున్నాయనే సమాచారంతో ఆయన అక్కడకు వెళ్లారు. కొందరు స్థానికులు ఆగ్రహంతో కోడిగుడ్డు విసరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
భాంగర్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.
మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు గడ్డుకాలం తప్పేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే, పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల్లో ఇటీవల పెల్లుబుకుతున్న అసంతృప్తి ఆ పార్టీని గుక్కతిప్పుకోనీయడం లేదు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తాజాగా బాంబు పేల్చాయి.
తృణమూల్ కాంగ్రెస్‌కు లోక్‌సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ పార్లమెంటు దిగువసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది.
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.