Home » TMC
తృణమూల్ కాంగ్రెస్‌కు లోక్‌సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ పార్లమెంటు దిగువసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది.
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.
పశ్చిమబెంగాల్‌లోని విపక్ష తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు 59 మంది పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణ గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ క్లెయిమ్ చేసుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌కు బుధవారంనాడు అందజేశారు.
తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ సంతకాలతో కూడిన లేఖను టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ స్పీకర్‌కు బుధవారంనాడు సమర్పించడం సంచలనమవుతోంది. రెబల్ వర్గం లేఖను స్పీకరించిన స్పీకర్ దీనిపై తన నిర్ణయాన్ని మధ్యాహ్నం 4 గంటలకు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. టీఎంసీలో కీలక నేతల తిరుగుబాటు మొదలైంది.
మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా మధురాపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాపీ హల్దార్ పార్టీ కార్యాలయంపై స్థానికులు ఆదివారంనాడు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వరద సహాయక సామగ్రిని అక్రమంగా పార్టీ కార్యాలయంలో దాచిపెట్టారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఈ దాడి జరిపినట్టు పోలీసులు తెలిపారు.
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో అరెస్టైన నిందితుల్లో కొందరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులు ఇప్పటికే సంచలనం సృష్టించగా, తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఖోకన్ దాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన దాడి తీవ్ర సంచలనమవుతోంది. బీజేపీ నేతలే తనను చంపేందుకు కుట్రపూరితంగా దాడి చేశారని అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలను తాజాగా బీజేపీ ఖండించింది. టీఎంసీలో అంతర్గత విభేదాలే దాడికి కారణంగా కనిపిస్తోందని పేర్కొంది.