• Home » TMC

TMC

సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్

సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్

సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్‌‌కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసు విచారణలో భాగంగా ఖాళీఘాట్‌లోని టీఎంసీ కార్యాలయానికి సీఐడీ బృందం మంగళవారంనాడు వెళ్లింది. అయితే సీఐడీ టీమ్‌ను కార్యాలయం ఆవరణలోకి అనుమతించలేదని తెలుస్తోంది.

లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమత లేఖ

లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమత లేఖ

లోక్‌సభలో కొత్త చీఫ్ విప్‌గా పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నియమాకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ చైర్మన్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభ స్పీకర్‌కు అధికారికంగా లేఖ రాశారు.

రిజైన్ చేసి హ్యాపీగా వెళ్లిపోవచ్చు... రెబల్ ఎంపీలకు టీఎంసీ ఘాటు సందేశం

రిజైన్ చేసి హ్యాపీగా వెళ్లిపోవచ్చు... రెబల్ ఎంపీలకు టీఎంసీ ఘాటు సందేశం

టీఎంసీ తిరుగుబాటు ఎంపీలపై ఆ పార్టీ సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ద్వంద్వ వైఖరి కలిగిన వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. పార్టీ పట్ల అంతగా అసంతృప్తి ఉంటే వాళ్లు రాజీనామా చేయాలన్నారు.

టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. స్పీకర్ ఓంబిర్లాకు 20 మంది లోక్‌సభ ఎంపీల లేఖ

టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. స్పీకర్ ఓంబిర్లాకు 20 మంది లోక్‌సభ ఎంపీల లేఖ

టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు పార్లమెంటుకు పాకింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి కొనసాగింపుగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.

రాజ్యసభకు టీఎంసీ ఎంపీ రాజీనామా, కేంద్ర మంత్రిని కలిసిన 11 మంది ఎంపీలు

రాజ్యసభకు టీఎంసీ ఎంపీ రాజీనామా, కేంద్ర మంత్రిని కలిసిన 11 మంది ఎంపీలు

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు.

నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్

నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్

పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా వాహనంపై కోడిగుడ్లతో దాడి

టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా వాహనంపై కోడిగుడ్లతో దాడి

తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కమార్‌హాటీ నియోజకవర్గంలోని అరియాదయా ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులున్నాయనే సమాచారంతో ఆయన అక్కడకు వెళ్లారు. కొందరు స్థానికులు ఆగ్రహంతో కోడిగుడ్డు విసరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

బాంబు పేలుడు కేసు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు..

బాంబు పేలుడు కేసు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు..

భాంగర్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.

మళ్లీ అదే సీను.. దీదీ సమావేశానికి హాజరైన 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు

మళ్లీ అదే సీను.. దీదీ సమావేశానికి హాజరైన 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు

మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు గడ్డుకాలం తప్పేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే, పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల్లో ఇటీవల పెల్లుబుకుతున్న అసంతృప్తి ఆ పార్టీని గుక్కతిప్పుకోనీయడం లేదు.

టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు

టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తాజాగా బాంబు పేల్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి