Home » Tirumala Tirupathi
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలే బాబా డెయిరీది కీలకపాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్ నివేదించింది.
తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవి సెలవులు చివరికి చేరుకోవడంతో తిరుమలకొండకు భక్తులు పోటెత్తారు. గురువారం నుంచే ఎటు చూసినా జనం కనిపిస్తున్నారు.
Leopard IN Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం సృష్టిచింది. చిరుత కదలికలతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ అధికారులు భక్తుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు.
తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగానైనా ప్రభుత్వం టీటీడీకి రెగ్యులర్ సీవీఎస్వోను నియమించింది. విశాఖపట్నంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణను టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీ చేసింది.
‘టీటీడీ గోశాలలో ప్రతినెలా 14వరకు గోవులు చనిపోతున్నాయని ఇప్పటికే గుర్తించాం. వంద గోవులు ఆసాధారణంగా చనిపోయాయంటూ చేసిన ప్రచారంలో వాస్తవాలు లేవు. త్వరలో మంచి ఫలితాలను అందరూ చూస్తారు’ అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.
తిరుమల నారాయణగిరి షెడ్లలో రెండు కుటుంబాల మధ్య గొడవ కారణంగా మహిళలు జుట్టు పట్టుకుని గొడవపడ్డారు. ఈ ఘర్షణ సమయంలో జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Srivari Govinda Namalu: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతోమంది దర్శించుకుంటారు. శ్రీవారిని ఇష్టదైవంగా పలువురు కొలుస్తారు. వేంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ నామాలను అభ్యంతరకరంగా ఓ చిత్రంలో వాడుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పుడు సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టింది.
పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ బలగాలు శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.
వెంకన్న దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిర్యాదుల బాక్స్, ఫీడ్ బ్యాక్ బుక్‌తో పాటు అధునాతన టెక్నాలజీ ద్వారా భక్తుల వద్ద నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ అందుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.