Home » Tirumala Laddu Controversy
శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం టీటీడీకి ఆవు నెయ్యి సరఫరాలో అక్రమాలు మొదలైంది 2019 నుంచేనని సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు ఆధారంగా తేటతెల్లమవుతోంది.
Tirumala Laddu: తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అవ్వగా.. త్వరలోనే మరికొందరి అరెస్ట్‌లు ఉంటాయని సమాచారం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేలా నూతన పరికరాలతో టీటీడీ ల్యాబ్ సిద్ధమైంది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు నియమించిన సిట్ బృందం చకచకా విచారణ కొనసాగిస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక సభ్యులు తిరుపతిలో మకాం వేశారు.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీతో ఏఆర్ డెయిరీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తన ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎట్టకేలకు విచారణ మొదలుపెట్టింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతి చేరుకోనప్పటికీ కింది స్థాయిలో డీఎస్పీల ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందానికి సంబంధించిన సిబ్బంది శుక్రవారం తిరుపతి చేరుకున్నారు.
కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?