Home » Thanneeru Harish Rao
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రేవంత్ ప్రభుత్వం కొత్త రికార్డు సాధించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు (Harish Rao) పనీపాట లేలని.. అందుకే ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో రైతులు ఖరీఫ్ పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని కాపాడటానికి గత సీఎండీ ప్రభాకర్ రావును దొంగచాటుగా అమెరికా వెళ్లి కలిసి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) బయటపెట్టారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్‌రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు.
అన్ని రకాల వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. సన్నవడ్లు, దొడ్డు వడ్లని కాకుండా అన్నిరకాల వడ్లకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఖమ్మం జిల్లాలో రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) అన్నారు.కాంగ్రెస్ పాలనాలో ఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్ అయ్యాయని ఆరోపించారు. రైతంగాన్ని నిలువునా రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులకు వడ్ల బోనస్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
కిర్గిజ్‌స్థాన్ (Kyrgyzstan) దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి.
తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కేవలం ఐదు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందని అన్నారు. బీజేపీ తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుందని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.