Home » TGSRTC
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరికలతో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేయడంతో పరిస్థితి కీలక దశకు చేరుకుంది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి డీఏను 2.1 శాతం పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
మద్యం మత్తులో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్‌తో యువకులు ఘర్షణకు దిగారు. రాళ్లతో బస్సు అద్దాలను పగలకొట్టారు. దీంతో బస్సు డ్రైవర్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు.
వికారాబాద్ ఆర్టీసీ డిపోలో సోమవారం అద్దె బస్సుల సర్వీసులు నిలిచాయి. డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా హైర్ బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే అద్దె బస్సులు బయటకు తీస్తామని తేల్చి చెప్పారు.
గ్రేటర్‌లో మెట్రో డీలక్స్ బస్సుల సంఖ్య పెంచే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానిలో భాగంగా చార్జీల్లో 15-20 శాతం రాయితీ కల్పిస్తోంది.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్(ట్రైనీ) ఉద్యోగాల భర్తీని త్వరలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీఎస్ఆర్టీసీ విడుదల చేసింది.
ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులకు సంబంధించి యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్‌ను రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ అయ్యింది.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. శుక్రవారం నాడు బస్ భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు.
వేసవికాలం గ్రేటర్ ప్రయాణికులకు 20-30 శాతం రాయుతీతో ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ మేరకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
‘‘మా ఊరి పేరు టీజీఎస్ ఆర్టీసీ టికెట్‌లో ఉండదా?’’ అంటూ గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం బంగ్లావెంకటాపూర్ నుంచి విడిపోయి మక్తమాసాన్‌పల్లి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.