• Home » TGSRTC

TGSRTC

Ponnam: ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ

Ponnam: ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ

త్వరలో టీజీఎస్‌ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సంస్థలో మిగిలిన ఖాళీలను సైతం భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

CM Revanth Reddy: మరిన్ని బస్సుల కొనుగోలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..

CM Revanth Reddy: మరిన్ని బస్సుల కొనుగోలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న ఆర్టీసీ బ‌స్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.

Hyderabad: ఆర్టీసీ సిబ్బంది జంగ్‌సైరన్‌..

Hyderabad: ఆర్టీసీ సిబ్బంది జంగ్‌సైరన్‌..

ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌(Congress) విస్మరించిందని ఆర్టీసీ జేఏసీ(RTC JAC) నేతలు విమర్శించారు.

TGSRTC: ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

TGSRTC: ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

సోమవారం ఉదయం గద్వాల్ డిపోకు చెందిన గద్వాల్ - వనపర్తి రూట్‌లో పల్లె వెలుగు బస్సులో నిండు గర్బిణీ సంధ్య.. రక్ష బంధన్ సందర్భంగా సోదరులతో రాఖీ కట్టించుకునేందుకు వనపర్తికి బయలుదేరింది. బస్సు నాచుపల్లి సమీపంలోకి రాగానే ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. బస్సు కండక్టర్ జి. భారతీ వెంటనే స్పందించారు. బస్సును పక్కకు ఆపి.. మిగిలిన ప్రయాణికులకు దింపేశారు అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో సంధ్యకు పురుడు పోశారు.

Hyderabad: అందుబాటులోకి 24 మెట్రో డీలక్స్‌ బస్సులు..

Hyderabad: అందుబాటులోకి 24 మెట్రో డీలక్స్‌ బస్సులు..

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) జంటనగరాల పరిధిలో 24 సరికొత్త మెట్రో డీలక్స్‌ బస్సులను(Metro deluxe buses) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వి.వెంకటేశ్వర్లు(Greater Hyderabad ED V.Venkateshwarlu) తెలిపారు.

Hyderabad: కొత్త బస్సులు  సిద్ధం.. త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్‌లు

Hyderabad: కొత్త బస్సులు సిద్ధం.. త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్‌లు

కొత్త బస్సులు వచ్చాయని, త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని హైదరాబాద్‌ రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌(Hyderabad Region Regional Manager B. Varaprasad) తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రద్దీ సమయాల్లో 110 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నదని వివరించారు.

TGSRTC: లాంగ్‌ రూట్లపై ఆర్టీసీ దృష్టి.. ఐటీ కారిడార్‌కు సర్వీసులు

TGSRTC: లాంగ్‌ రూట్లపై ఆర్టీసీ దృష్టి.. ఐటీ కారిడార్‌కు సర్వీసులు

కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల నుంచి కొండాపూర్‌(Kondapur)కు గురువారం నుంచి బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఘట్‌కేసర్‌ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్‌ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 రూట్‌లో రాజేంద్రనగర్‌ నుంచి అరాంఘర్‌ మీదుగా కొండాపూర్‌కు రెండు సర్వీసులు నడపనున్నారు.

Metro Deluxe Buses: గ్రేటర్‌కు 300 మెట్రో డీలక్స్‌ బస్సులు..

Metro Deluxe Buses: గ్రేటర్‌కు 300 మెట్రో డీలక్స్‌ బస్సులు..

గ్రేటర్‌లో మళ్లీ మెట్రో డీలక్స్‌ బస్సులు(Metro Deluxe Buses) అందుబాటులోకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సుల(Electric buses) రాక ఆలస్యంతో ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ దృష్టిసారించింది. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో సెప్టెంబర్‌ నాటికి 300 మెట్రో డీలక్స్‌ బస్సులు రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.

TGSRTC: 19న ఈసీఐఎల్‌ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు..

TGSRTC: 19న ఈసీఐఎల్‌ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు..

పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)కు ఈసీఐఎల్‌(కుషాయిగూడ) నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్‌ పి.చంద్రకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Hyderabad: హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Hyderabad: హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

పవిత్ర గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam) గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఈనెల 19వ తేదీన ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ జె.శ్రీలత తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి