Home » TG Politics
మంత్రి కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
ఉపాధ్యాయులపై చిన్నపాటి ఆరోపణలు వస్తేనే సస్పెండ్ చేస్తున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భార్య 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారంటూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు బహిరంగంగా ఆరోపించినా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర శాఖ పోరాటాలు ప్రశంసనీయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. ‘సడక్ సే సదన్ తక్’ అంటూ కాంగ్రె్‌సపై పోరాటాలను కొనసాగించాలని సూచించారు.
బీజేపీ, కాంగ్రెస్ పరస్పర దాడులు.. రెండో రోజూ కొనసాగాయి. భువనగిరిలో ఇరు వర్గాల కొట్లాట.. రణరంగాన్ని తలపించగా, వనపర్తితోపాటు వేర్వేరు ప్రాంతాల్లో బీజేపీ నేతల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
నాయకుల కళ్లుగప్పి పరారైనట్లు ప్రచారం జరుగుతున్న మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్.. ఆ పార్టీ అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందని తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పదేళ్లలో దోచుకున్న డబ్బులను ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ లెక్కపెడుతున్నారని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెద్ద కొడుకుగా ప్రశాంత్ రెడ్డి చెప్పుకుంటారని.. కానీ, మహాభారతంలో శకుని వంటి వ్యక్తి ఆయనని మండిపడ్డారు.
మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే దీనికి ఒక ముగింపు పలకాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠినంగానే చర్యలు తీసుకుని.. క్రమశిక్షణ విషయంలో మిగిలిన నాయకులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలన్న యోచనలో అధిష్ఠానం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి