Home » terrorist
తెలంగాణలోని మేడ్చల్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
శుక్రవారం హమ్జా బుర్హాన్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాల్గొన్నారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఏకే 47లతో పాటు, మరికొన్ని అధునాతన ఆయుధాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
దాడులు చేసేందుకు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడిన లష్కరే తొయిబా ఉగ్రవాది, తన బట్టతల చికిత్స కోసం మొత్తం వాయిదా వేశాడు. గత నెలలో అరెస్టైన ఉగ్రవాది శ్రీనగర్‌లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో బయటపడింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బయో టెర్రరిజం కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కీలక ముందడుగు వేశారు. బహిరంగ ప్రదేశాల్లో విషప్రయోగం ద్వారా అమాయక ప్రజలను చంపాలని ప్లాన్ చేసిన నిందితులపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపేందుకు రెక్కీలు నిర్వహిస్తూ, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఇతరులను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు కొద్దిరోజుల క్రితం విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్.. హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగం.. బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంలను కస్టడీకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మరో 6 మందిని విచారణ చేయనున్నారు.
విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిహాదీ గ్రూప్స్ కోసం ఇప్పటివరకు 42 మంది యువతులను రిక్రూట్ చేసి, వెపన్ ట్రైనింగ్ కోసం సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.
ఉగ్రవాద సంస్థలకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ ఈ రోజు (ఆదివారం)తో ముగుస్తుంది. ఐదవ రోజు కస్టడీలో భాగంగా ఏటీఎస్, ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ అధికారులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఐదుగురిని విచారిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌పై దాడులకు వ్యూహరచన చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్‌కు చెందిన షబ్బీర్ అహ్మద్ లోన్ లష్కరే తోయిబా ఆపరేటివ్.
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.