Home » Telugu Desam Party
Palnadu District News: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో శనివారం డబుల్ మర్డర్ జరిగింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం వర్గీయులు హత్యకు గురయ్యారు.
Minister Anam Ramanarayana Reddy: టీడీపీ కార్యకర్తలకు అండగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Minister Payyavula Keshav: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో గ్రామస్థాయి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కప్పం కట్టారని ఆరోపించారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్స్ అన్ని స్కాములు జరిగింది జగన్ హయాంలోనేనని విమర్శలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.
MP Kesineni Sivanath: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.జగన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.
Minister Kollu Ravindra: వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.
Minister Anagani Satya Prasad: కూటమిలో ఉన్న పార్టీల్లోని కార్యకర్తలకూ ఏదోక సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే బాధ్యత తమదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.
TDP Mahanadu: కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వాహణకు 19 కమిటీలను తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.
విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.
Minister Anam Ramanarayana Reddy: పారిశ్రామిక వేత్తలను ప్రాధేయపడి మంత్రి నారా లోకేశ్ ఏపీకి పరిశ్రమలు తెస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ఒక్కటిగా కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పేర్కొన్నారు.
Minister TG Bharath: రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 33 వార్డులను టీడీపీ కైవసం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. కష్టపడే వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. తన పని తీరును మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల మంత్రి పదవి ఇచ్చారని మంత్రి టీజీ భరత్ గుర్తుచేశారు.