Home » Telangana Politics
లోక్‌సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెళ్లి వార్తలపై మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) హాట్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు. సర్కార్ వైఫల్యాలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఆయన ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.
రూ.2 లక్షల రుణమాఫీకి(Loan Waiver) కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.
జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతను రేపటి(గురువారం) వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) స్పష్టం చేసింది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
పోలీసులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు అన్ని జిల్లాల ఉద్యోగులకు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్కను డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం పాలనపై పట్టు రావడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. రూ.2లక్షల వరకూ రైతు రుణ మాఫీ చేసినట్లు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి సగం మాత్రమే మాఫీ చేశారని ఆయన పేర్కొన్నారు.
ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలన్నారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం నేటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు.
కాంగ్రెస్ రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావుని(KTR) శ్రీలంక మంత్రి సదాశివం ఆయన నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రాభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ను ఆయన అభినందించారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండని అన్నారు. వాటితో ప్రజలకేం సంబంధం? అని అన్నారు.