• Home » Telangana News

Telangana News

Bhatti Vikramarka: విద్యార్థుల మృతిపై ఆరా తీసిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్..

Bhatti Vikramarka: విద్యార్థుల మృతిపై ఆరా తీసిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్..

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Hyderabad: కేంద్ర మంత్రితో దామోదర వర్చువల్ మీట్.. సీజనల్ వ్యాధులపై చర్చ

Hyderabad: కేంద్ర మంత్రితో దామోదర వర్చువల్ మీట్.. సీజనల్ వ్యాధులపై చర్చ

అసలే వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధుల నివారణపై చర్చించడానికి కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి వర్చువల్‌గా సమావేశం అయ్యారు.

Ponnam Prabhakar: వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తాం..

Ponnam Prabhakar: వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తాం..

వారం రోజుల్లో రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు.

TG news: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

TG news: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

జక్రాన్‌పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.

Hyderabad: న్యాయ‌వాదుల‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ లాయ‌ర్ల నిర‌స‌న‌

Hyderabad: న్యాయ‌వాదుల‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ లాయ‌ర్ల నిర‌స‌న‌

న్యాయ‌వాదుల‌పై పోలీసుల దాడుల‌ను ఖండిస్తూ DRT (డెబిట్స్ రిక‌వ‌రీ ట్రిబ్యున‌ల్‌) వ‌ద్ద లాయర్లు బుధ‌వారం నిర‌స‌న తెలిపారు. ఓ కేసు విష‌యంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన ఇద్దరు న్యాయ‌వాదుల‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశార‌ని జ‌న‌గామ బార్ అసోసియేష‌న్ ఆరోపించిన విష‌యం తెలిసిందే.

Telangana: నీటిపారుదల రంగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

Telangana: నీటిపారుదల రంగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి చైర్మన్‌గా కేబినెట్‌ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నది అభివృద్ధి&గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడం, మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహణ కోసం..

CM Revanth Reddy: చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలతో వరస భేటీలు నిర్వహిస్తూ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ(బుధవారం) చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను రేవంత్ రెడ్డి, టీమ్ సందర్శించనున్నారు.

Crime News: శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..

Crime News: శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..

శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్‌లో తరలిస్తున్న దాదాపు 800కిలోల గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Crime News: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. ఆటోలో ఎక్కించుకుపోయిన అగంతకుడు

Crime News: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. ఆటోలో ఎక్కించుకుపోయిన అగంతకుడు

అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న బాలికను ఓ అగంతకుడు ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

TG News: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అక్రమాలు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు..

TG News: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అక్రమాలు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు..

తెలంగాణ ఎక్సైజ్‌శాఖకు పన్ను చెల్లింపు విషయంలో రూ.77 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అవకతవకలు అన్నీ 2017-22మధ్య జరిగినట్లు తనిఖీల్లో గుర్తించామని తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పని తీరుపై కాగ్ మండిపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి