Home » Telangana High Court
Telangana: ఫార్ములా ఈరేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేటీఆర్ తరపున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేశారని న్యాయవాది సుందరం కోర్టుకు తెలిపారు.
Telangana: మాజీ మంత్రి కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు.
Telangana: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
Telangana: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు రాజ్ పాకాల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయనకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.
కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది.
Telangana: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణకు రాగా.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
Telangana: హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు.
Telangana: ‘‘చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి... జంప్ చేయకండి..అమీన్ పూర్‌పై మాత్రమే మాట్లాడండి... కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు ’’
Nalgonda BRS Office: భారత రాష్ట్ర సమితి పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాదు.. నల్లగొండ జిల్లాలోని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం 15 రోజులు గడువు కూడా విధించింది.