Home » Telangana Govt
Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో హైదరాబాద్ నగర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు.
Telangana: హైదరాబాద్‌లో నీట్ అభ్యర్థుల స్థానికత రగడ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 6 -12 తరగతి వరకు చదివిన వాటిలో వరసగా నాలుగు తరగతుల ఆధారంగా స్థానికత ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 9,10, ఇంటర్ చదివిన ఆధారంగా స్థానికత నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎక్సైజ్‌శాఖకు పన్ను చెల్లింపు విషయంలో రూ.77 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అవకతవకలు అన్నీ 2017-22మధ్య జరిగినట్లు తనిఖీల్లో గుర్తించామని తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పని తీరుపై కాగ్ మండిపడింది.
ఆటపాటలతో హాయిగా ఆడుకోవాల్సిన చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన వయస్సులో పనిముట్లు పట్టుకుంటూ సంతోషాలకు దూరం అవుతున్నారు. పరిశ్రమలు, హోటళ్లు, ఇటుక బట్టీల్లో పని చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి వారిని రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టింది. అలాగే బాల్య వివాహాలు నిర్మూలించేందుకు సైతం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో బాధిత చిన్నారులను రక్షించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
Telangana: విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జీలను సర్కార్ పరిశీలిస్తోంది. జస్టిస్ వెంకటేశ్వర రావు ప్రభుత్వ పరీశీలనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కసరత్తు మొదలుపెట్టింది.
Telangana: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు ..
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ(Telangana)లో వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 13మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీలు బి.ప్రతాప్‌కుమార్, ఎ.విశ్వప్రసాద్, ఏసీబీలో పనిచేస్తున్న బి. శ్రీకృష్ణాగౌడ్, డి.కమలాకర్‌రెడ్డి అలాగే సీఐడీ విభాగంలో ఉన్న కె.శంకర్, డి.ఉపేంద్రారెడ్డికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు.
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్(Central Minister CR Patil)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది డెవలప్మెంట్, రాష్ట్రంలోని ఇళ్లకు నల్లా కనెక్షన్ల కోసం పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.
Telangana: దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ర్ట ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు.